మన ఈనాడు:తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. రెండు రోజులపాటు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
6 Guarantees Applications : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2 రోజులు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం కావడంతో 2రోజుల పాటు దరఖాస్తులకు అధికారిక సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ 2వ తేదీ నుంచి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ చేయనుంది. 28న మొదలైన దరఖాస్తుల స్వీకరణ 2రోజుల సెలవులు తీసేస్తే 8 రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.