మన ఈనాడు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వేగంగా ముందుకెళ్తుంది. ఆరు గ్యారెంటీలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హామీలను అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తుంది. దీనిలో భాగంగానే గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన(Praja Palana) పేరుతో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్లికేషన్లు వస్తున్నాయి. వీటిలో మహాలక్ష్మీ స్కీంకు దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటి తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు.
వీటికంటే కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో…చాలా మంది వీటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో పదేళ్లలో ఒకసారి మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేసినా..పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. వాటి ఆమోదం కోసం దరఖాస్తు దారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సర్కార్ మారడంతో రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ అటకెక్కింది. మళ్లీ కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
హస్తం కింద ఐదు గ్యారెంటీల లబ్దీకొరకు దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నారు. అప్లయ్ చేయని వాళ్లుంటే అధికారులు వాళ్లింటికి వెళ్లి వారితో మాట్లాడేలా చేస్తన్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 10లక్షలకు పెంపు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి తప్పకుండా వాళ్లకు రేషన్ కార్డులను మంజూరు చేయబోతున్నారు.