మన ఈనాడు:తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. CMకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమబాట పట్టారు.
తెలంగాణ(Telangana) సాధన కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. పోలీసు(Telangana Police) అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నళిని గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. తెలంగాణ సాధన కోసం ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని అధికారులను సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.