మన ఈనాడు: ఆరు గ్యారెంటీల పథకానికి నేటి నుంచి రాష్ట్రంలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. డిపెంబర్ 28 నుంచి జనవరి 6వరకు కొనసాగనుంది.
తెలంగాణలో హస్తం పార్టీ అధికారం చేపట్టాక ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల హామీ పథకాల కొరకు దరఖాస్తులను ప్రజల నుంచి నేరుగా అధికారులు తీసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కింద సర్కారు యంత్రాంగం ప్రజల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించడం జరుగుతుంది. 10రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్జీలు తీసుకుంటారు. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్టు జిరాక్స్‌ను కూడా జతచేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు వివరాలు పూర్తి చేసిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించాలి.దరఖాస్తుదారుడు ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు.దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.