Zero Electricity Bill| విద్యుత్తు చార్జీలు చెల్లించొద్దు..ఇలా చేయండి..

Mana Enadu: తెలంగాణలో ఎవరికైనా 200 యూనిట్ల లోపు ఉండి కరెంట్ బిల్లు వస్తే కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపిన ఆయన తెలంగాణ లో కరెంటు డిమాండ్ బాగా పెరిగిందని, రాష్ట్రంలో కరెంటు కష్టాలు రాబోతున్నాయని ప్రచారం చేస్తున్నారని, ఆ అపోహాల్ని నమ్మోద్దని సూచించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని గత ప్రభుత్వ పెద్దలు అన్నారని, 2022 డిసెంబర్ లో 200 మిలియన్ యూనిట్లు వాడితే 2023 డిసెంబర్ 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని, గత ప్రభుత్వం సరఫరా చేసిన దానికంటే ఎక్కుడ కరెంట్ డిసెంబర్ నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రజలంతా నిశ్చింతగా, సంతోషంగా ఉండాలని, మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసే బాధ్యత మాదని హామీ ఇచ్చారు. అలాగే ఎంత పీక్ డిమాండ్ ఉన్నా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గృహ జ్యోతి పథకం అమలు చేసినప్పటి నుంచి 200 యూనిట్ల లోపు ఉన్నవారికి జీరో బిల్లు వస్తుందని, కొందరికి బిల్లు వస్తుందని తమ దృష్టికి వచ్చిందని అన్నారు.

ఇలా బిల్లులో 200 యూనిట్లలోపు ఉన్న వారికి బిల్లు వస్తే వారు ఆ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులో పొరపాటుగా నమోదు చేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని, ఆ బిల్లుతో పాటు రేషన్ కార్డు తీసుకెళ్లి ఎంపీడీఓ ఆఫీస్ నందు నమోదు చేయించుకుంటే జోరో బిల్లు వస్తుందని తెలియజేశారు.

Share post:

లేటెస్ట్