లాస్ వేగస్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మైన్ ఎక్స్​పోలో నేడు ప్రసంగం

ManaEnadu : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti VIkramarka) అధికారుల బృందంతో కలసి ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లారు. అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భట్టి విక్రమార్క లాస్‌వేగస్‌లో జరిగే అంతర్జాతీయ మైనింగ్‌ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈనెల 24వ తేదీన ఆయన మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పో తోపాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలు సందర్శించారు. 121 దేశాల నుంచి 40 వేల మంది ప్రతినిధులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.

అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్​పో భట్టి ప్రసంగం

అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్ పో (international mining expo) సంద‌ర్భంగా ఈ స‌ద‌స్సులో ఇవాళ (సెప్టెంబరు 25వ తేదీన) భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగించ‌నున్నారు. మూడ్రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో అత్యాధునిక‌, భారీ మైనింగ్ ఖ‌నిజ ఉత్ప‌త్తి యంత్రాలు తెలంగాణలో మైనింగ్​లో ఆధునిక సాంకేతికత వినియోగం, ఇత‌ర రంగాల్లో అవ‌కాశాల‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Speech in America) ప్రసంగిస్తారు. ఆయన వెంట‌ ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఆర్థిక‌, ప్ర‌ణాళిక శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి కృష్ణ భాస్క‌ర్‌, సింగరేణి సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్‌ ఈ పర్యటనకు వెళ్లారు.

అమెరికాలో బిజీబిజీగా భట్టి

మైనింగ్ సాంకేతిక‌త‌ల‌ (Mining Technology)పై అధ్య‌య‌నానికి తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉన్న‌త స్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో అన్వేష‌ణ అవ‌కాశాలు, విస్త‌ర‌ణ‌ అవకాశాలపైన ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం (Telangana Deputy CM) దృష్టి సారించనున్నారు. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతో పాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని భట్టి తెలిపారు. అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్పో లో ప్రసంగించిన అనంతరం భట్టి విక్రమార్క.. హోవర్ డాం ను సందర్శించి 27వ తేదీన EDWARDS & SANBORN బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని పరిశీలిస్తారు.

29న జపాన్​కు భట్టి విక్రమార్క

28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. ఇక అమెరికా నుంచి 29వ తేదీన జపాన్ (Bhatti Vikramarka Japan Tour) వెళ్తారు. టోక్యో చేరుకున్న తర్వాత 30వ తేదీన స్థానిక దౌత్యవేత్త ఏర్పాటు చేసిన డిన్నర్ లో పాల్గొని పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా సమావేశమై.. యమన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శించిన తర్వాత.. 2న తోషిబా, కవాసాకీ(kawasaki)ల ప్రధాన కార్యాలయాల సందర్శన తదుపరి ఒసాకా చేరుకుంటారు. 3న పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి 4న హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

 

Related Posts

Bhairavam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రం జులై 18 నుంచి ZEE5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *