మన ఈనాడు: రాష్ట్ర స్థాయిలో జరిగిన బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో ఖమ్మం రెజొనెన్స్ విద్యార్ధిని శ్రీవల్లి సత్తా చాటింది. సౌత్ ఇండియా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై అందరి ప్రశంశలు అందుకుంటుంది. తెలంగాణ డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క 9వ తరగతి చదువుతు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చూపించడాన్ని అభినందించారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో రెజొనెన్స్ స్కూల్ బేబి మానిటరింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్‌తో విజయాలు సాధించందన్నారు. ఎంతో అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుందని కొనియాడి, అంత గొప్ప కీర్తిని పొందేవిధంగా విద్యార్థులకు చక్కటి శిక్షణను ఇస్తున్నటువంటి రెజొనెన్స్ శ్రీనగర్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు కూడా శ్రీవల్లి ఎన్నిక కావాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సోమశేఖర శర్మ మాట్లాడుతూ పనిలో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణను పర్యావేక్షణ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ల సహయంతో వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా రూపొందించిన బేబి మానిటరింగ్ సిస్టం ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రథమ స్థానంలో నిలచిందన్నారు. దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనకు ఖమ్మం జిల్లా నుంచి రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ విద్యార్థిని డి.శ్రీవల్లి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు మాట్లాడుతూ ఉన్నత ఆశయాలతో నాణ్యమైన విద్యా ప్రమాణాలతో విద్యార్థులలో దాగిన అంతర్గత శక్తులను వెలికితీస్తూ విద్యను సామాజిక సమస్యలకు పరిష్కారాలను చూపే విధంగా నూతన ఆవిష్కరణలకు అనుకూలంగా విద్యాభోదన చేస్తూన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెజొనెన్స్ ప్రధానోపాధ్యాయులు యం.ప్రసన్నరావు, ఉపాధ్యాయులు శ్రీవల్లికి అభినందనలు తెలియజేసారు.