ఏపీలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. పదోతరగతి ఫరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. లేట్ ఫీజుతో డిసెంబర్ 1నుంచి 4వరకు పెంచింది. తాజాఉత్తర్వులు ప్రకారం లేట్ ఫీజుతో రూ. 500తో డిసెంబర్ 10 నుంచి 14వరకు గడువును పెంచినట్లు పేర్కొంది.
ఏపీలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది ఏపీ సర్కార్. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించిన సర్కార్..రూ. 50ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 నుంచి 4వరకు గడువు పెంచింది. అదే విధంగా రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 5 నుంచి 9 వరకు అలాగే రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 10 నుంచి 14వరకు ఫీజు గడువును పెంచుతూ జీవో జారీ చేసింది.
ఫీజు గడువు పెంపు:
ఏపీలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సర్కార్ ఓ మంచి అవకాశాన్ని కల్పించింది. వార్షిక పరీక్షల ఫీజు గడువు నవంబర్ 30తో ముగుస్తుంది. అయితే దాన్ని మరో 14రోజులు పొడిగిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే నవంబర్ 30వ తేదీ వరకు సాధారణ ఫీజు చెల్లించే ఛాన్స్ ఇచ్చింది. ఈ గడువులోగా చెల్లించలేని వాళ్లకు లేటు ఫీజుతో కట్టుకునే వెసులుబాటును కల్పించింది.
100మార్కుల చొప్పున 6 పేపర్లు:
ఏపీలో పదోతరగతి పరీక్షల గ్రేడింగ్ ప్రక్రియలో ఇంటర్నల్ మార్కులను పరిగణలోనికి తీసుకోరు. ఎస్ ఎస్సీలో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులు ప్రధానం. ఒక్కో పేపర్ కు గరిష్టంగా వంద మార్కులు ఉంటాయి.
పరీక్ష వ్యవధి:
జనరల్ సైన్స్ సబ్జెక్ట్ పేపర్ కు సంబంధించి ఫిజికల్ సైన్స్ , బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ప్రతిపరీక్షకు 2గంటల సమయం ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ లో రెండు పేపర్లు ఉంటాయి. కాంపోజిట్ పేపర్ 1, 70 మార్కులకు గాను పేపర్ 2, 30 మార్కులకుగాను ఉంటుంది.