తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో వారంలో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక ప్రచార సభల్లో పాల్గొంటారు పవన్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో వారంలో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక ప్రచార సభల్లో పాల్గొంటారు పవన్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, మధ్యాహ్నం 3 గంటలకు దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారు. టీబీజేపీతో పొత్తులో భాగంగా ఇచ్చిన 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉండగా ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ తరపున పవన్ క్యాంపెయిన్ చేస్తారని తెలిసింది. ఈ నెల 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారు.
వాస్తవానికి ఈ నెల మొదటివారంలో బీజేపీ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో కలిసి పవన్ కల్యాణ్ వేదికను పంచుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రసంగించారు కూడా. ఆ తర్వాత ఎక్కడా ప్రచారంలో కనపించలేదు పవన్. సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనూ పవన్‌తో ప్రచారం చేయించాలని టీబీజేపీ నేతలు యోచిస్తున్నారు. దీనికి తోడు తాము బరిలో ఉన్న నియోజకవర్గా్ల్లో పవన్ పర్యటిస్తే గెలుపు అవకాశాలు పెరుగుతాయని మిగతా జనసేన అభ్యర్థులు ఆశిస్తున్నారు.
కాగా.. పవన్ కల్యాణ్ ప్రచారంతో లెక్కలు మారే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పవన్ కల్యాణ్ ప్రచారం ఏ మేరకు కలిసివస్తుందనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..