మన ఈనాడు:
ఉప్పల్ నియోజకవర్గ బీఎఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారానికి మంత్రి తన్నీరు హరీష్‌రావు బుధవారం మల్లాపూర్ వస్తున్నారు. వీఎన్ఆర్ గార్డెన్స్‌లో మహిళలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
పొదుపు సంఘాలు, స్వయం ఉపాధి పొందడానికి, ఒంటరి మహిళలు ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ సర్కారు అందించిన సంక్షేమ పథకాలను మహిళలకు మరోసారి వివరించబోతున్నారు. పథకాలు కంటిన్యూ కావాలంటే మహిళల మెచ్చిన సీఎం మరోసారి అధికారం చేట్టాలంటే కారు గుర్తుకు ఓటేయాలని ప్రసంగించనున్నారు.
సామన్యులకు అందుబాటులో ఉంటే కుటుంబం నుంచి వచ్చిన మీ ప్రాంతం బిడ్డ బండారి లక్ష్మారెడ్డి గెలిపించుకోని ఉప్పల్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల ఇంఛార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, సాయిజెన్‌శేఖర్ సభ ప్రాంగణం ఏర్పాట్లు పూర్తి చేశారు