
తెలంగాణ గ్రూప్-2 (Group 2) అభ్యర్థులకు గుడ్ న్యూస్. తాజాగా గ్రూప్-2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. గ్రూప్ 2 అభ్యర్ధుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. మార్కులతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీటును కూడా వెబ్ సైట్ లో కమిషన్ అందుబాటులో ఉంచింది. గ్రూప్ 2 ఫైనల్ ఆన్సర్ కీతో పాటు టాపర్స్ జాబితాను కూడా విడుదల చేసినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గతేడాది పరీక్షలు.. ఇప్పుడు ఫలితాలు
తెలంగాణ వ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది డిసెంబరు 15, 16వ తేదీల్లో 368 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని టీజీపీఎస్సీ ఈ ఏడాది జనవరి నెలలో 17వ తేదీన రిలీజ్ చేయగా.. ఆన్సర్ కీ అభ్యంతరాలను జనవరి 22వ తేదీ వరకు స్వీకరించింది. తాజాగా తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలు విడుదల చేసింది.