తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు(Telangana Intermediate Results 2025) ఇవాళ విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) రిజల్ట్స్‌ను అనౌన్స్ చేయనున్నారు. రాష్ట్రంలో ఫస్ట్, సెకండియర్లకు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకూ పరీక్షలు(Inter Exams) జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 60 లక్షల ఆన్సర్ పేపర్లను 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేశారు.

అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు
ఏప్రిల్ తొలి వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి మార్కుల వెరిఫికేషన్(Marks Verification), ఆన్‌లైన్ ఫీడింగ్ వంటి పనులు పూర్తి చేశారు. కాగా ఈ రోజు ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల తేదీల(Inter Supplementary Exam Dates)ను కూడా డిప్యూటీ సీఎం ప్రకటించనున్నారు. కాగా విద్యార్థులు తమ రిజల్ట్స్(Results)ను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in.లో చూసుకోవచ్చు. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్(Hall Ticket Number), పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.








