మన ఈనాడు:కమ్యూనిస్టుల కంచుకోటలో మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు..అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే ప్రభుత్వంలో ఉన్నత పదవులు అందుకున్నారు. ప్రగతి కోసం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించిన ఘనత ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకే సొంతం.
తండ్రి గెలుపు కోసం తనయుడు ఊరురా తిరుగుతున్నాడు. భట్టి విక్రమార్క పెద్ద కొడుకు సూర్య విక్రమాదిత్య, భార్య నందిని మధిర నియోజకవర్గ ప్రచారంలో తమదైనశైలిలో ప్రచారం సాగిస్తున్నారు. మధిర భట్టిదే..తెలంగాణ కాంగ్రెస్‌దే..అధికారం..అభివృద్ధి హస్తంతోనే సాధ్యం అవుతుందని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్నారు.
రాష్ర్ట ప్రజల కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే..మధిర ప్రజల కోసం భట్టి కొడుకు మల్లు సూర్యవిక్రమాదిత్య, అమ్మ పౌండేషన్ పేరుతో భార్య మల్లు నందిని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ గడిచిన 15ఏళ్లుగా దగ్గరయ్యారు. అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. మధిర నియోజకవర్గంలో ప్రజల కళ్లముందే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. చింతకాని మండలంలో లచ్చగూడెం, బస్వాపురం గ్రామాల్లో తల్లికొడుకులు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. హస్తం గుర్తుకు ఓటేసి రాబందుల పాలను నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. దళితులు పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. 3ఎకరాల భూమి, దళితబంధు పథకాల పేరుతో వంచిస్తున్నారని విమర్శించారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు..హమీలుగానే మిగిలిపోయ్యాయని ఆరోపించారు.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…