Mana Enadu: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరో షాక్ తగిలింది. కవిత కేసులో నేడు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ లో తీహార్ జైలు నుంచి కవతను హాజరుపరిచారు అధికారులు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు ఈనెల 20 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేయనుంది కోర్టు.