టి. కాంగ్రెస్ సంక్షోభంలోకి తీసుకెళ్తోంది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

Mana Enadu:బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను, దేవళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే, హామీలు ఎలా అమలుచేస్తారని విమర్శించారు. హామీల అమలుకు ప్రతి ఏటా రూ. 2 లక్షల కోట్లు కావాలని వివరించారు.

సీఎం రేవంత్ సైతం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి తీసుకెళ్తోందని ఘాటుగా స్పందించారు.

ధరణి సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. గ్యారేజ్ నుంచి కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లు దక్కడమే గగనమని తెలిపారు. కాంగ్రెస్‌లో, బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు. రెండు పార్టీలు బీజేపీ గెలుపును ఆపేందుకు యత్నించాయని ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజలు మోదీనామస్మరణ చేశారన్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ సర్కారుకు ఆగస్ట్ సంక్షోభం తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందన్న సీఎం రేవంత్ మాటలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. హామీలు అమలుచేయకపోతే ప్రజలు కాదు, కాంగ్రెస్ నేతలే తిరగబడుతారని తెలిపారు.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *