Deputy CM| 14స్థానాలు కాంగ్రెస్​కే..డిప్యూటీ సీఎం భట్టి

 Mana Enadu: లోక్ సభ ఎన్నికల పోరు ముగిసింది. ఇక, జూన్ 4వ తేదీన ఫలితాలు వెలవడనున్నాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో చర్చలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని ఈ సందర్భంగా భట్టి జోస్యం చెప్పారు.
మంత్రి శ్రీధర్ బాబు స్వ గ్రామమైన మంథని మండలం ధన్వాడలో వివిధ దేవాలయాల మూడో వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు.

కేంద్రంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమినే అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు యత్నించాయని పరోక్షంగా బీజేపీపై ఫైర్ అయ్యారు. కానీ దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇండియా కూటమి వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మిషన్ 15 టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. కనీసం 14 సీట్లులో గెలుపొందేలా ఎన్నికల బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందో చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సి ఉందన్నారు.

Related Posts

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Road Accident: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మహాకుంభమేళా(Maha Kumbhamela)కు భక్తులతో వెళుతున్న బస్సు(Bus)ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కోర్బా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *