వైరా జలాశయం కింద రైతులకు గుడ్​ న్యూస్​

మన ఈనాడు: వైరా జలాశయం కింద కాలువల ఆధునీకరణ చేసేందుకు సర్కారు సిద్దం అయింది. పదేళ్లుగా ఎదురుగా చూస్తున్న రైతంగానికి గుడ్​ న్యూస్​. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులకు నిధులు త్వరలోనే మంజూరు కాబోతున్నాయి.

పార్లమెంట్​ ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో ఖమ్మం రాజకీయాలతోపాటు అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా కీలక నేతలు పక్కాగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. దశబ్దాలుగా ముందుకు కదలని పనులకు నిధులు మంజూరు చేయించేందుకు అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ రైతులకు వరాలు వర్షం కురిపించబోతుంది.

వందేళ్ల క్రితమే నైజం నవాబులు వైరా జలాశయాన్ని నిర్మించారు. 25వేల ఎకరాలకు పైగానే ఆయకట్టు ఉంది. 40కిలో మీటర్లు వరకు కుడి, ఎడమ కాలువలు విస్తరించి ఉన్నాయి. గతంలో రూ.54కోట్ల నిధులతో గైడ్​వాల్స్​ నిర్మాణం కోసం జైకా నుంచి నిధులు సైతం మంజూరు అయ్యాయి. 16కీలోమీటర్ల నిర్మాణం పూర్తి కావడంతో మరో 25కిలోమీటర్ల వరకు గైడ్​వాల్స్​ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వైరా జలాశయం ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు అవ్వబోతున్నాయి.

Share post:

లేటెస్ట్