Mana Enadu: మల్కాజిగిరి టికెట్ కోసం భారతీయ జనతాపార్టీ నుంచి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్,(DPS) పల్లవి విద్యాసంస్థల (PALLAVI SCHOOLS)అధినేత మల్క కోమురయ్యకు నిరాశే మిగిలింది.
పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నే టికెట్ కేటాయించారు. రాజకీయ అరంగ్రేటం చేసిన మల్క కోమురయ్యకు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం మల్క కోమురయ్యకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.నేడో….రేపో మల్క కోమురయ్య గులాబీ కండువా కప్పుకోనున్న ట్లు తెలిసింది.
మల్కాజిగిరి లోకసభ టికెట్ తన కుమారుడితో సహా కుటుంబ సభ్యులకు వద్దని మల్లారెడ్డి చెప్పడంతో .. గులాబీ బాస్ మల్క కోమురయ్య ను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మల్క కోమురయ్యను ఒప్పించి, పార్టీలోకి రప్పించేందుకు నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి బాధ్యత అప్పగించినట్లు సమాచారం.
సదరు మాజీ మంత్రి మల్క కోమురయ్యతో సంప్రదింపులు జరుపగా, కోమురయ్య కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన వెంటనే..మల్కాజిగిరి టికెట్ కోమురయ్యకు ప్రకటించే అవకాశం ఉంది.మల్లారెడ్డి పోటీ విషయంలో యూ టర్న్ తీసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ బలమైన నేత కోసం వేట ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలని ఉత్సుహకతో ఉన్న మల్క కోమురయ్యను బరిలో దించాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పల్లవి మోడల్ స్కూల్స్ తో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కు ఆయనే బాస్. అయితే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కోమురయ్యకు పదుల సంఖ్యలో విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యార్థులు, అధ్యాపక బృందం తో సహా వేల సంఖ్యలో యంత్రాంగం ఉంది. దీనికి తోడు మున్నురు కాపు వర్గానికి చెందిన వాడు కావడంతోపాటు మోడీ బిల్డర్స్ పేరిట నిర్మాణ సంస్థ కూడా ఉంది.ఆర్థికంగా బలంగా ఉండటంతో మల్క కోమురయ్యనే సమర్ధుడని పార్టీ ఆయన ను సంప్రదించినట్లు తెలిసింది.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…