Gruha Jyothi Scheme | తెల్ల రేషన్‌కార్డు ఉంటే..బిల్లు కట్టక్కర్లే

Mana Enadu: Gruha Jyothi Scheme In telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. 200లోపు యూనిట్ల విద్యుత్ వాడకందారులకు జీరో బిల్లులు జారీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 40, 33, 702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేసింది. చాలా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

రేషన్ కార్డు, ఆధార్ నంబర్, కరెంట్ కనెక్ష వివరాలు సక్రమంగా ఉన్నవారికి ఇప్పటికే జీరో బిల్లులను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. అయితే కొంతమంది విద్యుత్ వినియోగదారులు 200లోపే కరెంట్ వాడుకున్నా.. ప్రభుత్వం కోరిన వివరాలు సమర్పించకపోవడంతో వారికి జీరో బిల్లులు జారీ కాలేదు. అలాంటి వారిని లబ్ధిదారుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

తెల్ల రేషన్ కార్డు ఉండి.. 200 లోపు యూనిట్ల కరెంట్ వాడుకున్న వారికి సాధారణ బిల్లు జారీ అయినా అది చెల్లంచనవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. వారు మండల పరిషత్ , మున్సిపల్, విద్యుత్ , రెవెన్యూ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు, ఆధార్ నంబర్, విద్యుత్ కనెక్షన్ వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలని సూచించారు. అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లు జారీ అవుతుందని తెలిపారు. ఇప్పటికే 45 వేల మంది రివైజ్డ్ బిల్లులు ఇచ్చామని వెల్లడించారు.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *