మన ఈనాడు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో పరారీలో ఉన్న భారాస చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేపాల్ లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. సీఎంను దూషించడంతో పాటు చెప్పు చూపించినందుకు మంచిర్యాలతో సహా పలు పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే పరిణామాలు ఊహించి కేటీఆర్ ఇంటికి చేరుకున్న సుమన్.. అధిష్టానం చేతులెత్తేయడంతో అక్కడి నుంచి మధ్యప్రదేశ్, వయా ఉత్తరప్రదేశ్ చేరుకున్నారని.. అక్కడి నుంచి నేపాల్ పారిపోయారని తెలిసింది. లుకవుట్ నోటీసు జారీ చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కాట్మండులోని డ్యాన్సింగ్ యాక్ పబ్‌లో సుమన్ ను గుర్తించిన ఓ తెలంగాణ వాసి ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు.
Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!
రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…








