మన ఈనాడు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చినట్లు వారు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తరలించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు తమ్మినేని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.