మన ఈనాడు: ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న వేళ.. టీఎస్‌ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిజూ ఉదయం 8 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి.. ఉప్పల్ స్టేడియం వరకు ఏకంగా 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తిరిగి రాత్రి 7 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే క్రికెట్ అభిమానులు ఈ ప్రత్యేక బస్సుల సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు. ఇక బస్సు రూట్ల వివరాలు ఇలా ఉన్నాయి.