మన Enadu: పాలు అమ్మినా..పూలు అమ్మినా..తొడగొట్టినా..డైలగ్ విసిరినా..ఆయన ఏది చేసినా ట్రెండింగ్లోకి రావాల్సిందే..ఈసారి ఏకంగా బీఆర్ఎస్కి షాక్ ఇచ్చి..సీఎం రేవంత్ గూటికి వెళ్లేందుకు రెఢీ అయ్యారని సమాచారం.
సోషల్ మీడియా ట్రెండింగ్ లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్దమైంది. పార్టీలోకి చేరేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఆయనతోపాటు నాగారం, బోడుప్పల్, ఫీర్జాదిగూడ మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లును తీసుకెళ్లడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం లైన్ క్లియర్ చేయలేదని తెలుస్తుంది.
రేవంతన్న పార్టీలోకి ఒక్కడితో వచ్చేదే లేదు..ఫ్యామిలీతోనే వస్తాను అనుకున్నారా..? కాదు కాదు లక్షమందితో మూడురంగుల కండువా కప్పుకుంటా..భారీ బహిరంగ సభతోపాటు బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేస్తానంటూ ప్లీజ్..ప్లీజ్ నన్ను కాంగ్రెస్లో జాయిన్ చేర్చుకుండంటూ సీఎం రేవంత్ సన్నిహితుల వద్ద ప్రదర్శనలు చేస్తున్నారు. ఒక్కసారి సీఎం రేవంతన్న అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరగా ఆయన అందుబాటులో లేరని సమాచారం ఇచ్చారు.
ఈనెల 13వ తేది పార్లమెంటు ఎన్నికల కోడ్ రాబోతుండగా మల్లారెడ్డితోపాటు, అల్లుడు రాజశేఖర్రెడ్డి, కొడుకు భద్రారెడ్డితో కాంగ్రెస్ లో జాయిన్ కావాలని ఫిక్స్ అయ్యారు. భద్రారెడ్డిని మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్లమెంటు బరిలో నిలపాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ కుదిరితే సీటు లేదంటే కనీసం జాయిన్ చేయించుకోవాలని వేడుకున్నారని తెలిసింది. రెండు రోజుల్లోనే మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడం మాత్రం ఫిక్స్ అయిందని తెలుస్తుంది.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…