మన ఈనాడు: రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఖమ్మం ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. నాడు వెండితెర రాముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో పులిపాటి అడుగులు ఇక్కడి నుంచే పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలోనూ కేసీఆర్ చేసిన అమరణ నిరాహార దీక్షలో ఖమ్మం చరిత్రలో నిలిచింది.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఖమ్మం పాలిటిక్స్ మరోసారికి చర్చకు దారి తీసింది.
ప్రొగ్రెసివ్ డెమక్రసీ ఫోరమ్(PDF) పేరుతో ఖమ్మం కేంద్రంగా రాజకీయ వేదిక పురుడుపోసుకుంటుంది. విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం(TDP) నాయకుడిగా గుర్తింపు పొందిన పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం పీడీఎఫ్(PDF) రాజకీయ విధివిధానాలు వెల్లడించబోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందాక రాష్ర్టంలో సమీకరణాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. ఈక్రమంలో ఖమ్మం(khammam) బీఆర్ఎస్కు చెందిన ప్రముఖ నేతలంతా రాజీనామా చేసి ఒక్కతాటిపైకి వచ్చేలా పులిపాటి వ్యూహాలు రచించారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్‌లో భవిష్యత్ కార్యాచరణకు సిద్దం అయ్యారు. శుక్రవారం గాంధీచౌక్ బడ్జెట్ హోటల్లో వివరాలు వెల్లడించనున్నారు.
హోరాహోరీగా జరగనున్న పార్లమెంట్ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థి గెలుపులో ప్రొగ్రెసివ్ డెమక్రసీ ఫోరమ్ క్రీయశీలక పాత్ర పోషించబోతుందన్నది స్పష్టం అవుతుంది. బీఆర్ఎస్ను వీడిన నేతలంతా ఒక్కటై కాంగ్రెస్‌తో జత కట్టకుండా పీడీఎఫ్ కేంద్రంగా సహకరింబోతున్నట్లుగా తెలుస్తుంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి అత్యంత సన్నిహితుడుగా పులిపాటి మెలిగారు.పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్ఠీఆర్ కి వెన్నంటే ఉండే అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర తెలుగు విద్యార్థి కన్వీనర్ గా, ఖమ్మం జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ గా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా పని చేశారు. ఎన్టీఆర్ గండిపేటలో శిబిరం నడిపిన సమయంలో వ్యక్తిగత ఆంతరంగికుడిగా కూడా విధులు నిర్వర్తించారు. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి కూడా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు.
3 వందల మంది సైన్యం అండగా
బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్ధపడిన డాక్టర్ పులిపాటి ప్రసాద్ నిర్ణయానికి మద్దతు పలుకుతూ మరో 3 వందల మంది గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ గురువుగా భావించి అభిమానించే మహానేత నందమూరిని కించపరిచే పార్టీలో ఇక ఇమడలేనని నిర్ణయించుకున్న పులిపాటి నిర్ణయానికి వెన్నుదన్నుగా నిలుస్తూ కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా 3 వందల మంది ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు.
బీఆర్ఎస్ వీడే నేతలు.. వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, మండదపు వెంకటేశ్వరరావు, కంచర్ల దయాకర్, వీరునాయక్, సింగ్.శ్రీనివాసరావు, మాసెట్టి వరప్రసాద్ రావు, కాయల రాఘవయ్య గౌడ్, ఎండీ.ఖయూమ్, తొట్టి ఉపేందరమ్మ, బండారి నాగేశ్వరరావు, కుమ్మరి వెంకటేశ్వర్లు, జమలాపురం రామకృష్ణ, వల్లూరి తిరుపతిరావు గోళ్ళ రాధాకృష్ణ, వరదా నర్సింహారావు, సూరపనేని వెంకటరమణ, సుంకర. నర్సింహారావు, ఐనాల శ్రీనివాసరావు , కొత్తపల్లి అప్పారావు పీడీఎఫ్‌తో జత కడతన్నారు.