రైతులకు గుడ్​ న్యూస్​..ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీకి సర్కారు ప్లాన్​

మన ఈనాడు:Cong Govt Plans to Rythu Runamafi : రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు ఎం. కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని, పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Cong Govt Plans to Rythu Runamafi : రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త అందించబోతోంది. రైతు రుణమాఫీ(Rythu Runamafi) దిశగా చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులలో రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే రుణమాఫీ ప్రక్రియ కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.Congress Plan on Farmer Loan Waiver : పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతం, కాంగ్రెస్‌ ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Crop Loan Waiver Scheme : రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇచ్చి, రూ.రెండు లక్షల రుణమాఫీకి ప్రణాళికలు రచిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *