మన Enadu: నాలుగు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారంతో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల పేర్లును ఖారారు చేసే పని పూర్తి చేశారని సమాచారం. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ నుంచి తొలిజాబితా తొమ్మిదిమంది పేర్లు దాదాపుగా ఖారారు చేశారని రేపు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సికింద్రాబాద్ నుంచి అనూహ్యంగా మరో పేరు తెరమీదకి వచ్చింది. బీసీ సామాజిక వర్గంతోపాటు సికింద్రాబాద్ ప్రాంతంలో యాదవ్ బలమైన సామాజిక వర్గం ఉంది. ఈక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్‌గా ఉన్న బొంతు శ్రీదేవి పేరును ఖారారు చేసినట్లు తెలిసింది.
మహబూబాబాద్ నుంచి విజయాబాయి, మహబూబ్‌నగర్ నుంచి వంశీరెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ పెట్కార్, చేవళ్ల నుంచి సునితా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పేర్లు ఖారారు చేశారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.