Hyderabad Fire accident: బిస్కెట్​ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌ కాటేదాన్‌లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటల ఎగిసి పడుతుంటడంతోపాటు దట్టమైన పొగలు వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

దీంతో మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్న పరిశీలిస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share post:

లేటెస్ట్