Jani Master: జానీ మాస్టర్‌కు షాక్.. లైంగికంగా వేధించాడంటూ యువతి ఫిర్యాదు

Mana Enadu: జానీ మాస్టర్( Jani Master).. సినిమాల గురించి తెలిసిన వారికి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ కొరియోగ్రాఫర్‌(Choreographer)గా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఆయనొక నేషనల్ అవార్డు విన్నర్(National Award Winner) కూడా. అలాంటి వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ(sexually abusing) ఓ యువతి ఆరోపించింది. ఈ మేరకు హైదరాబాద్లో(HYD)ని నార్సింగి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు FIRలో సంచలనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆయనపై కేసు(Case) పెట్టింది ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్(woman choreographer) ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమెపై జానీ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది.

 ఎఫ్ఐఆర్‌ నివేదికలో ఏముందంటే..

FIR ప్రకారం.. జానీ మాస్టర్ 2019 నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ యువ డాన్సర్ (21) ఆరోపించింది. 2019 లో ఢీ షో(Dhee show)లో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడనీ, ఆ తరువాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. అవుట్ డోర్ షూటింగ్(Outdoor shooting) పేరిట చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది. అదే సమయంలో సంచలన ఆరోపణలు చేసింది. మత మార్చుకుని తనను పెళ్లి(Marriage) చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడనీ, పలు మార్లు దాడి చేశారని పేర్కొంది. అంతేకాదు జానీ మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదనీ, ఆమె కూడా తనపై దాడి చేసిందని FIRలో బాధితురాలు పేర్కొంది.

 పవన్‌కు వీరాభిమాని

ఇదిలా ఉండగా జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకోవడంతో జనసేన(Janasena) పార్టీ కూడా ఆయనకు షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధిష్ఠానం ఆదేశించింది. అంతేకాదు తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు వీరాభిమాని. AP ఎన్నికలకు ముందు జానీ జనసేనలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు చోట్ల ప్రచారం కూడా చేశాడు. కాగా జానీ మాస్టర్‌పై పోలీసులు SEC 376 (Rapr), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (N) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *