Kalyana Lakshmi: గుడ్ న్యూస్..త్వరలోనే కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

Mana Enadu: కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలంటూ సర్కార్ ను ప్రభుత్వం ఆదేశించింది.


ఈనెల 27 వరకు చెక్కుల పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని..త్వరగా పంపడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి కోర్టును కోరారు. కౌశిక్ రెడ్డి పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది కోర్టు. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ల లబ్దిదారులకు రాష్ట్రం చెల్లించాల్సిన ఆర్థిక సహాయం అందజేస్తామని అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ జస్టిస్ ఎస్ నందాకు తెలిపారు.

లబ్దిదారులకు చెందిన 71 చెక్కులను లబ్దిదారులకు పంపించామని..చెక్కుల చెల్లుబాటు జూన్ 27తో కాకుండా ఆగస్టులో ముగుస్తుందని కోర్టుకు తెలిపారు. అంతేకాదు ఒక్క చెక్కు కూడా ల్యాప్ అవ్వగుండా ప్రభుత్వం జారీ చేసిన జీఓలలో పేర్కొన్న విధంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఆర్థిక ప్రయోజనం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చెక్కుల పంపిణీ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయడం లేదని జూన్ 27తో చెక్కుల గడువు ముగుస్తుందని పిటిషనర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాదించిన వాదనల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

కాగా పూర్తి వివరాలను సమర్పించేందుకు రెండు వారాల సమయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలు అర్హులైన లబ్దిదారులకు చెక్కుల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలను అందించడానికి ఇమ్రాన్ ఖాన్ తన వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కోరారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *