వదల బొమ్మాళీ వదల.. రాజ్ తరుణ్ వెంటాడుతున్న లావణ్య.. నా భర్త నాకు కావాలంటూ రచ్చ

Mana Enadu: గత కొంతకాలంగా టాలీవుడ్లో రాజ్ తరుణ్ – లావణ్య – మాల్వీ మల్హోత్రాల ట్రయాంగిల్ స్టోరీ వివాదంపైనే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. లావణ్య రాజ్ తరుణ్పై వరుస ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తోంది. తాజాగా ఈ యంగ్ హీరో లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దకు కూడా వచ్చి రచ్చ చేసింది. తన భర్త తనకు కావాలని, కొందరు వ్యక్తులు అతడిని కలవనీయకుండా అడ్డుకుంటున్నారని రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించింది. 

బుధవారం రోజున రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా కలిసి నటించిన ‘తిరగబడరసామీ’ ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్ బయట లావణ్య హైడ్రామా చేసింది. రాజ్‌తరుణ్‌ను సపోర్ట్‌ చేసే వాళ్లందరూ కలవనీయకుండా చేస్తున్నారని.. ఏ తప్పు చేయకపోతే తప్పించుకుని వెళ్లిపోతున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. 

 

తామిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని.. గుడిలో తన మెడలో తాళికట్టాడని.. అప్పుడు తామిద్దరం కలిసి సెల్ఫీ తీసుకున్న ఫొటోలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. వాటిని కోర్టులో సమర్పించామని.. అప్పుడే పిల్లలు వద్దని రెండుసార్లు అబార్షన్‌ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. పదేళ్లు కలిసి జీవించిన తర్వాత చెప్పకుండా తనను వదిలేసి వెళ్లిపోయాడని చెప్పింది. ఇప్పుడు మాల్వీ మల్హోత్రతో రాజ్‌ ఏం చేస్తున్నాడన్నది నిరూపిస్తాననియ. వాళ్లిద్దరూ ఎక్కడకు వెళ్తున్నారని.. చేయాల్సిందంతా చేసేసి, ఇప్పుడేమో లాయర్‌ మాట్లాడతాడంటే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది.

 

మరోవైపు ‘తిరగబడర సామీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో లావణ్య కాంట్రవర్సీ గురించి నటుడు రాజ్‌తరుణ్‌ స్పందిస్తూ.. తన వద్ద సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ విషయంపై న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పాడు. దీనిపై మాల్వీ మల్హోత్రా కూడా మాట్లాడుతూ..  తనతోపాటు తన సోదరుడిపై లావణ్య చేసిన ఆరోపణల గురించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడానని.. జులై 24న ఆమె తనకు చేసిన మెసేజ్ను కూడా పోలీసులకు అందించానని చెప్పింది. దానిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారని తెలిపింది. మొత్తానికి రాజ తరుణ్ – లావణ్య – మాల్వీ మల్హోత్రాల ట్రయాంగిల్ స్టోరీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 

 

 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *