ManaEnadu:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా గ్యాలంటరీ పతకాలు సాధించిన వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య గ్యాలంటరీ పతకం లభించింది. దేశం మొత్తం మీద ఒక్కరికే ఈ పతకం లభించడం గమనార్హం. మొత్తం 1037 మందికి రాష్ట్రపతి పోలీస్ సేవా పతకాలను ప్రకటించగా.. ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్, 208 మందికి పోలీసులకు గ్యాలంటరీ, 75 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా , 624 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.
ఏపీ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 21 మంది పోలీసులకు పతకాలు దక్కాయి. ఏపీలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ఠ సేవా పతకం, నలుగురికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, 19 మందికి విశిష్ఠ సేవా పతకాలు లభించగా.. తెలంగాణలో ఒకరికి ప్రెసిడెంట్ గ్యాలంటరీ పతకం, ఏడుగురికి పోలీస్ గ్యాలంటరీ, 11 మందికి పోలీస్ సేవా పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ లభించింది.
ఏపీలో గ్యాలంటరీ మెడల్ దక్కిన అధికారులు
ఇన్స్పెక్టర్ షేక్ సర్దార్ ఘని
సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్,
రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరామ పరదేశీ
హెడ్ కానిస్టేబుల్ రాజన గౌరీ శంకర్
తెలంగాణలో గ్యాలంటరీ మెడల్ దక్కిన అధికారులు
ఏపీఎస్ సునీల్ దత్
డిప్యూటీ అసాల్ట్ కమాండర్ కుమార్
అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ సంతోశ్
జూనియర్ కమాండర్స్ సురేశ్, వంశీ, ఉపేందర్, రమేశ్
రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం
ఐజీ రవి ప్రకాష్ (ఆంధ్రప్రదేశ్)
ఇన్స్పెక్టర్ దాసరి రాజు (ఆంధ్రప్రదేశ్ )
ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ (తెలంగాణ)
డిప్యూటీ కమిషనర్ కటకం మురళీధర్ (తెలంగాణ)
ఉత్తమ ప్రతిభా పురస్కారాలు (తెలంగాణ)
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…