గబ్బర్.. నీ ట్రేడ్‌ మార్క్‌ స్మైల్​ను మిస్‌ అవుతున్నాం: విరాట్‌ కోహ్లీ

ManaEnadu:ప్రముఖ టీమ్​ ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్​ ధావన్​ అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​ బై​ చెప్పాడు. ఇంటర్​నేషనల్​, డొమెస్టిక్​ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్​​ ప్రకటించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాలను షాక్​కు గురి చేసింది. దీనిపై పలువురు క్రికెటర్లు స్పందిస్తూ.. భవిష్యత్ అద్భుతంగా కొనసాగాలంటూ శిఖర్​కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. అలాగే శిఖర్​తో గ్రౌండ్లో, డ్రెస్సింగ్ రూమ్​లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ధావన్ రిటైర్మెంట్​పై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు.

ప్రస్తుతం లండన్​లో తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్న విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ రిటైర్మెంట్​పై సోషల్ మీడియా పోస్టు పెట్టాడు. “శిఖర్.. తొలి మ్యాచ్​లోనే అద్భుత ప్రదర్శన చేశావు. అరంగేట్రమే అద్భుతంగా సాగింది. నువ్విచ్చిన ఎంట్రీ ఎంతో మైండ్ బ్లోయింగ్​గా ఉన్నా.. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి భారత్​ జట్టులో నమ్మదగిన ఓపెనర్లలో ఒకడిగా నిలిచే వరకు నీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఆ జ్ఞాపకాల్లో నేనూ భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది.”

“ఆట పట్ల నీకున్న నిబద్ధత, అభిరుచి, క్రీడా స్ఫూర్తి అమోఘం శిఖర్. నీ రిటైర్మంట్ బాధ కలిగించినా.. నీ ఆటతో పాటు నీ ట్రేడ్ మార్క్​ స్మైల్​ను మేం చాలా మిస్ అవుతున్నాం. నీ లెగసీని కొనసాగిస్తాం. నీ పర్ఫామెన్స్ మరిచిపోలేనిది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు అందించావు. మంచి మనసుతో ముందుండి మమ్మల్ని నడిపించావు. నీ జీవితం, నీ భవిష్యత్ అద్భుతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను గబ్బర్.” అంటూ కోహ్లీ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గబ్బర్-కింగ్ డెడ్లీ కాంబినేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక శిఖర్ దావు రిటైర్మెంట్​పై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ‘‘నీ అద్భుతమైన క్రికెట్‌ కెరీర్‌కు అభినందనలు..భవిష్యత్తులో నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఇదే ఉత్సాహంతో పని చేస్తావని నాకు తెలుసు ధావన్‌’’ అంటూ పోస్టు పెట్టారు. ‘‘శుభాకాంక్షలు ధావన్‌.. మొహాలీలో నువ్వు నా స్థానంలోకి వచ్చినప్పటి నుంచి అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చావు. నీ కెరీర్లో ఏనాడూ వెనుదిరిగి చూడలేవు. కుటుంబసభ్యులతో నీ జీవితాన్ని ఆనందంగా, సంపూర్తిగా జీవించాలని కోరుకుంటున్నా’’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ రాసుకొచ్చారు.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *