మహిళలపై నేరాల్లో 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు.. బంగాల్ నేతలే ఎక్కువ

ManaEnadu: ప్రముఖ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్ (ADR) దేశంలోని సిట్టింగ్ నేతల నేర చరిత్రపై మరోసారి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో దేశవ్యాప్తంగా 151 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో 16 మందిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో ఎక్కువగా బంగాల్ కు చెందిన నాయకులు ఉన్నారని వెల్లడించింది.

బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన చెరో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయని వివరించింది. నేరాలు రుజువైతే వీళ్లకు 10 ఏళ్లు లేదా జీవిత కారాగారం పడే అవకాశం ఉందని తెలిపింది. 2019-2024 మధ్య ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల అఫిడివిట్లను పరిశీలించిన ఏడీఆర్ అందులో మహిళలపై నేరాలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదిక విడుదల చేసింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలి ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నివేదిక రిలీజ్ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ విచారణ జరగాలని కోరిన ఏడీఆర్.. నేరాలు ఎదుర్కొంటున్న నేతలకు ఓటు వేయొద్దని ఓటర్లకు సూచించింది. 

మహిళలపై నేరాలు చేసినట్లు కేసులు ఎదుర్కొంటున్న వారు 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బంగాల్ నుంచి 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 మంది చట్టసభ్యులతో ఆంధ్రప్రదేశ్​ రెండో స్థానంలో ఉంది. 17 మందితో మూడో స్థానంలో ఒడిశా నిలిచింది. అత్యధికంగా 54 మంది బీజేపీ నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు 24 మంది ఉన్నారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *