Mana Enadu: అందాల భామ అమీ జాక్సన్.. గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బ్రిటన్‌కు చెందిన ఈ భారతీయ మోడల్, తెలుగు, హిందీ, తమిళం చిత్రాల్లో నటించింది. తన అందంతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2, సాహో లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే ఇంగ్లండ్‌కి చెందిన జార్జ్ అనే వ్యక్తితో లవ్ అఫైర్ నడిపింది. అతనితో కొంతకాలం లివింగ్ రిలేషన్షిప్‌లో ఉన్న భామ.. కొంతకాలం తర్వాత ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే పెళ్లి చేసుకోకుండానే వీరి బంధానికి 2022లో ఎండ్ కార్డు పడింది.
తాజాగా అమీ జాక్సన్ పెళ్లి చేసుకుంది. ఇందకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంగ్లిష్ యాక్టర్, మ్యుజీషియన్ అయిన ఎడ్వర్డ్ వెస్ట్‌విక్‌తో ఇటలీలో ఆమె వివాహం గ్రాండ్‌గా జరిగింది. గత కొంతకాలంగా వీరు ప్రేమలో ఉన్నారు. అతడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలనూ అమీ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. ఈ ఏడాది జనవరిలో అమీకి ఎడ్ ప్రపోజ్ చేశాడట. ఆ క్రమంలోనే తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్‌తో కన్న కొడుకుని పక్కన పెట్టుకొనే ఈ జంట ముద్దుల్లో మునిగిపోయారు కూడా. దీంతో కొందరు వీరు చేసే పనులని తెగ తిట్టిపోశారు. అమీ జాక్సన్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాలలో సందడి చేస్తూ వస్తుంది.
16 ఏళ్లకే మోడల్‌గా కెరీర్ ప్రారంభం
అమీ జాక్సన్ పదహారేళ్ల ఏజ్‌లోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్‌గా నిలిచింది ఈ అందాల బొమ్మ. తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. ఇదే క్రమంలో తెలుగులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ప్రభుదేవా డైరెక్షన్‌లో వచ్చిన అభినేత్రి సినిమాలో నటించింది. ప్రభాస్ సరసన సాహోలోనూ నటించి తన అందాలతో కుర్రకారు గుండెల్ని పిండేసింది.