తొలి విడత సక్సెస్.. రేపటి నుంచి మలిదఫా

మన Enadu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మలివిడత శంఖరావం యాత్రకు రెడీ అయ్యారు. గురువారం ఉదయం హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నారా లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఈ యాత్రలో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అంశాలపై పార్టీ కేడర్‌ను సిద్ధం చేయడంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు టీడీపీ కార్యక్రమాల్లో మెరుగైన పని తీరు కనబర్చిన కార్యకర్తలో భేటీ కానున్నారు. వారికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా గురువారం ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుగొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న పుట్టపర్తి, కదిరి, 9న శివరాత్రి సందర్భంగా తాత్కాలిక విరామం, 10 నుంచి యధావిథిగా శంఖారాయం యాత్ర కొనసాగనుంది.

Share post:

లేటెస్ట్