ఆర్​ఎస్పీ, కేసీఆర్​ చర్చలు..పార్లమెంటు పొత్తులకే

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ(BSP) కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి.

ఈమేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RSP) భేటీ అయి పొత్తులపై చర్చించారు. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోయే స్థానంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో మేము మరికొన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే అని కేసీఆర్ అన్నారు.

ఆర్ఎస్పీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగర్న కర్నూల్ నుంచి ఆర్ఎస్పీ ప్రవీణ్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోందని మీడియా అడగగా పెద్దపల్లి, వరంగల్, నుంచి పోటీ చేయవద్దా? అని అన్నారు. కాగా పెద్దపల్లి నుంచి ఇప్పటికే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మిగిలిన నాగర్ కర్నూల్, వరంగల్ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆర్ఎస్పీ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం మాయవతి ఆదేశిస్తే నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. దీంతో ఆయన పొత్తు కుదిరినప్పటికీ నాగర్ కర్నూల్ నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *