సెప్టెంబరులో ఏపీకి ప్రధాని మోదీ.. ‘క్రిస్‌ సిటీ’కి శంకుస్థాపన?

ManaEnadu:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్‌ సిటీ (Kris City in AP)) పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిసింది. తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ స్మార్ట్‌ ఇండస్ట్రియల్‌ సిటీగా రాష్ట్రంలో క్రిస్ సిటీ రూపొందబోతోంది. సెప్టెంబరు మొదటి వారంలో ప్రధాని పర్యటన ఉండొచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఒకవేళ వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని (PM Modi) రాక కుదరకపోతే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని (సెప్టెంబరు 20న) ప్రధాని పర్యటన ఉండేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రధాని పర్యటన తేదీ ఖరారు కోసం పీఎంవోతో రాష్ట్ర అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. మోదీ పర్యటన తేదీ ఖరారైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి మోదీ రావడం ఇదే తొలిసారి అవుతుంది. ఒకవేళ ప్రధాని పర్యటన (PM Modi AP Tour) వీలు కాకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం .. వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తోంది.

చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్‌ సిటీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం (2014-19) మధ్య కేంద్రం నుంచి అనుమతులు పొందింది. ఎన్నికలకు ముందు హడావుడిగా గత సర్కార్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు భవిష్యత్తు బాగున్న నేపథ్యంలో క్రిస్‌ సిటీ, అచ్యుతాపురం సెజ్‌ (Atchutapuram Sez)ల్లో ఆ తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మూడు దశల్లో 11,096 ఎకరాల్లో క్రిస్‌ సిటీ

అంతర్జాతీయ ప్రమాణాలతో ‘క్రిస్‌ సిటీ’ ఏర్పాటుకు జాకబ్స్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌.. మాస్టర్‌ప్లాన్, నమూనాలను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడు దశల్లో 11,095.90 ఎకరాల్లో క్రిస్‌ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించాయి. గ్రీన్‌ జోన్, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, పని ప్రదేశంలో నివాస ప్రాంతాలు, ఫుడ్‌ కోర్టు, పని షెడ్లతో ఓ అత్యాధునిక నగరాన్ని నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ (AP Govt) వాటా కింద భూములను సమకూర్చితే.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిక్‌డిక్ట్‌ నిధులు సమకూరుస్తుంది. ఇందులో తొలిదశ ద్వారా సుమారు రూ.18,458 కోట్ల పెట్టుబడులు, 88 వేల మందికి ఉపాధి లభిస్తాయని అధికారులు అంచనా వేస్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *