Mana Enadu:టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇట్స్ గ్లోటైమ్’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్‌ను సూచిస్తుంది.
కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ప్రతి ఏడాది ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. ఈ ఈవెంట్‌లో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్, కొత్తగా హార్డ్‌వేర్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రానున్నట్లు తెలిసింది.
ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐఫోన్ 16 సిరీస్ విషయానికి వస్తే.. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మొత్తం నాలుగు మోడళ్లు ప్రకటించనుంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గతసారి ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్ బటన్‌ను పరిచయం చేయగా.. ఈ సారి అన్నిమోడళ్లు లేటెస్ట్ జెన్ హార్డ్‌వేర్, ఏఐతో రానున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.