ఆర్బీఐ అలర్ట్.. ఆగస్టు 2024 బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! 

Mana Enadu:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2024 ప్రతి నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆగస్టు నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈనెల దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇందులో జాతీయ సెలవులు, ప్రాంతీయ సెలవులు ఉన్నట్లు వెల్లడించింది.  కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిదని పేర్కొంది.

2024 ఆగస్టు​​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

ఆగస్టు 4వ తేదీ (ఆదివారం) : ఈరోజున దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. కేరళలో కర్కిడక వావుబలి పండుగ కూడా ఇవాళే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కూడా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 7వ తేదీ (బుధవారం) : హరియాలీ తీజ్ పండుగ​ సందర్భంగా హర్యానాలోని బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ.
ఆగస్టు 8వ తేదీ (గురువారం) : ‘టెండాంగ్ లో రమ్​ ఫాత్’ ఉత్సవం సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది.
ఆగస్టు 10వ తేదీ (రెండో శనివారం) :
ఆగస్టు 11వ తేదీ (ఆదివారం) :
ఆగస్టు 13వ తేదీ (మంగళవారం) : దేశభక్తుల దినోత్సవం సందర్భంగా మణిపుర్​లోని బ్యాంకులకు సెలవు ప్రకటించింది.
ఆగస్టు 15వ తేదీ (గురువారం) : భారత స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది.
ఆగస్టు 16వ తేదీ (శుక్రవారం) : ‘డి జ్యూర్ ట్రాన్స్​ఫర్​ డే’ సందర్భంగా పుదుచ్చేరిలోని బ్యాంకులకు సెలవు ప్రకటించింది.
ఆగస్టు 18వ తేదీ (ఆదివారం) :
ఆగస్టు 19వ తేదీ (సోమవారం) : రాఖీ పౌర్ణమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. జులన్​ పూర్ణిమ సందర్భంగా ఒడిశాలోని బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు తెలిపింది.
ఆగస్టు 24వ తేదీ (నాలుగో శనివారం) :
ఆగస్టు 25వ తేదీ (ఆదివారం) :
ఆగస్టు 26వ తేదీ (సోమవారం) : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?..  ఆగస్టు ​నెలలో మొత్తం 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.  యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయని పేర్కొంది.  బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చని వెల్లడించింది.

 

Bank Holidays In August 2024, August Bank Holidays 2024, 13 holidays for banks in August 2024

Share post:

లేటెస్ట్