ManaEnadu:PubG ఈ వీడియో గేమ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ గేమ్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక ఈ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన పిల్లలున్నారు. ఈ ఆటకు బానిసై చదువును పక్కన బెట్టేసి, చివరకు డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకున్న కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్నేళ్ల పాటు ఈ గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ గేమ్ అందుబాటులోకి వచ్చింది.
తాజాగా ఓ యువకుడుని పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు తాళం చెవి, నాలుగు అంగుళాల కత్తి, నెయిల్ కట్టర్స్ మింగేశాడు. ఈ ఘటన బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా చాంద్మారి ప్రాంతంలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువకుడు ఈ మెటల్స్ను మింగడంతో కొద్ది గంటల్లోనే అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు సోనోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. రిపోర్టులో యువకుడి పొట్టలో కనిపించిన వస్తువులు చూసి కంగుతిన్నారు. అనంతరం అతడికి సర్జరీ చేసి పొట్టలో నుంచి తాళం చెవి, కత్తి, రెండు నెయిల్ కట్టర్స్, చిన్న మెటల్ వస్తువులను తొలగించినట్లు డాక్టర్ అమిత్ కుమార్ తెలిపారు. దాదాపు గంటపాటు శ్రమించి వాటిని పొట్టలో నుంతి బయటకు తీశామని వెల్లిడించారు. యువకుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.
మరోవైపు బాధిడుతి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్, ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడని చెప్పుకొచ్చారు. సినిమాలు చూస్తూ.. వీడియో గేమ్స్ ఆడుతూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడని.. అందువల్లే మానసికంగా వీక్ అయ్యాడని తెలిపారు. అందరి కంటే తానే గొప్ప అని చెప్పుకోవడానికి ఇలా మెటల్ వస్తువులను మింగుతున్నాడని పేర్కొన్నారు.