Mana Enadu: ప్రముఖులు, సెలబ్రిటీలు ఖరీదైన దస్తులు, బ్రాండెట్ వస్తువులు వాడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వారి సంపాదనకు తగ్గట్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపే వారిగా కొందరు గుర్తింపు పొందాలని ఆరాటపడుతుంటారు. కొందరు మాత్రం ఎంత లగ్జరీ(Luxurious) స్టేటస్ ఉన్నా చాలా సింపుల్‌గా ఉంటారు. ఈ విషయంలో బాలీవుడ్(Bollywood) సెలబ్రిటీలు కాసింత ఎక్కవ లగ్జరీ లైఫ్‌నే కోరుకుంటారు. కాస్ట్లీ కార్లు, డూప్లెక్స్ ఇళ్లు, ఫామ్ హౌస్‌లు అక్కడ చాలా మందికే ఉన్నాయి కూడా. తాజాగా ఇలాంటి కలల సౌధాన్ని నిర్మించుకున్నారు బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా, రణ్‌వీర్(Deepika Padukone-Ranveer Singh).
షారూక్ ఖాన్ మన్నత్‌కు సమీపంలోనే..
ముంబైలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మన్నత్( Shah Rukh Khan’s Mannat)కు సమీపంలో ఈ ఇంటిని నిర్మిస్తుంచుకుంటోంది ఈ జంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. అత్యంత విలాసవంతంగా, హై టెక్నాలజీ హంగులతో ఈ ఇంటిని నిర్మించుకుంటున్నారట. సముద్రానికి తీరానికి ఎదురుగా బాంద్రా(Bandra) ప్రాంతంలో చేపట్టిన ఈ ఇంటి నిర్మాణానికి ఏకంగా రూ.100 కోట్లు(Rs.100cr) ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న సెలబ్రిటీల(Celebrity) జాబితాలో ఒకరిగా నిలవనుందీ జంట. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చివరి దశలో ఉంది. కాగా ప్రస్తుతం తల్లికాబోతున్న దీపికా.. బిడ్డకు జన్మనివ్వగానే కొత్తింటిలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ జంట 2021లోనూ అలీబాగ్‌లో రూ.22 కోట్ల ఇంటిని కొనగోలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్త ఇంటి విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ వామ్మో రూ. వంద కోట్ల ఇల్లా అంటూ నోరెళ్లబెడుతున్నారు. దీపికా, రణ్‌వీర్‌లు కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉండి, 2018లో పెళ్లి చేసుకున్నారు. తాజాగా దీపిక Kalki 2898 AD చిత్రంలో నటించారు. ఇక రణ్‌వీర్ ప్రస్తుతం డాన్ మూవీలో నటిస్తున్నారు.








