డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ కలిసి స్టెప్పులేస్తే ఎలా ఉంటది?.. ఈ వైరల్ వీడియో చూడండి

ManaEnadu:ప్రస్తుతం ట్రెండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. ఏఐతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది తమకు నచ్చిన హీరోకు నచ్చిన సింగర్ వాయిస్‌ను యాడ్ చేసి ఆ హీరోనే గొంతెత్తి పాడినట్లు వీడియోలు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే వివిధ రకాలుగా ఏఐతో వీడియోస్ కొలాబ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్‌తో కలిసి ఫొటో దిగినట్లు.. మోదీకి హ్యాండ్ షేక్ ఇచ్చినట్లు.. కేటీఆర్, రేవంత్ కలిసి డ్యాన్స్ చేసినట్లు.. ఇలా తమకు నచ్చిన వ్యక్తులను కొలాబ్ చేసి నిజంగా వాళ్లు కలిసిపోయినట్లు ఉన్న వీడియోలు తయారు చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను స్వయంగా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఖాతాలో పోస్టు చేయడం విశేషం.

ఎలాన్ మస్క్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో మస్క్.. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. ఈ వీడియోలో ట్రంప్, మస్క్ కలిసి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. హిప్ హాప్ స్టైల్‌లో ఈ ఇద్దరి డ్యాన్స్ మూవ్స్‌ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఈ వీడియో పోస్టు చేసిన మస్క్.. గిట్టనివాళ్లు ఇది ఏఐ క్రియేషన్ అంటారు అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 81.6 మిలియన్ మంద వీక్షించారు.

‘ఇది నిజమా లేక ఏఐ మాయా?’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘అది నిజమైన వీడియోనే.. దాన్ని షూట్ చేస్తున్నప్పుడు నేనక్కడే ఉన్నానంటూ’ ఒకరు కామెంట్ చేయగా.. ‘నైస్ సినిమాటోగ్రఫీ’ అంటూ మస్క్ రిప్లై ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ఇది మరో కొత్త ప్రయత్నం’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎలాన్‌ మస్క్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ చర్చా కార్యక్రమానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

https://x.com/elonmusk/status/1823742501884453312

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *