Mana Enadu: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల(Heavy Rains & Floods)కు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతోంది. జనం మౌలిక వసతుల కోసం అల్లాడుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సాయం(Help) చేస్తున్నా అది అంతంత మాత్రమే. శివారు గ్రామాలు, కాలనీల ప్రజలు తాగునీరు, తిండి, ఇతర అవసరాల కోసం అల్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణలోనూ భారీ వర్షాలకు జనం వణికిపోయారు. ముఖ్యంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో జనం అత్యవసర పనుల కోసం నానా అవస్థలు పడిన సంగతి తెలిసిందే.

కొనసాగుతున్న మరమ్మతు పనులు
APలో వర్షాలు, వరదలతో రవాణా వ్యవస్థ(Transport System) అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. వరద కారణంగా ముఖ్యంగా రైళ్ల(Trains) రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పలు రైళ్లను రద్దు తాజాగా చేసింది. వరదల కారణంగా పలుచోట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపింది. మరోవైపు రైల్వేశాఖ(Railway Department) అధికారులు అన్ని రైళ్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో విజయవాడ(Vijayawada) మీదుగా నడిచే 44 రైళ్లను తాజాగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. ఇందులో చూస్తే విజయవాడ, రాజమండ్రి, తెనాలి, గుంటూరు, గుడివాడ, నిడదవోలు, నర్సాపూర్, ఒంగోలు, మచిలీపట్నం, భీమవరం, రేపల్లె మధ్య నడిచే పలు సర్వీసులు ఉన్నాయి. మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయని(Drm vijayawada) అధికారులు చెబుతున్నారు.
⚠️TRAVEL ALERT (Bulletin No.48)
Due to flood water overflowing at Rayanapadu Station, Trains have been Cancelled / Diverted as detailed@SCRailwayIndia@RailMinIndia pic.twitter.com/g52ntXftrK
— DRM Vijayawada (@drmvijayawada) September 5, 2024
తెలుగు రాష్ట్రాలకు తప్పిన అల్పపీడన ముప్పు
వాతావరణ శాఖ(India Meteorological Department) తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా వర్షాలు, వరదలతో బాధ పడుతున్న తెలుగు ప్రజలపై వరుణుడు దయ చూపాడు. దీంతో ఏపీ, తెలంగాణకు మరో పెను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్పపీడనం పశ్చిమ బంగాళాఖాతం నుంచి పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరానికి చేరుకోనుందని తాజాగా IMD తెలిపింది. దీంతో అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడే అవకాశం లేదని వెల్లడించింది. అయితే AP, Telanganaపై అల్పపీడనం ప్రభావం లేకపోయిన సరే మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.






