Duleep Trophy 2024: సీనియర్లు లేకుండానే దులీప్ ట్రోఫీ.. టీమ్స్ ఇవే

Mana Enadu: ప్రతిష్ఠాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ(Duleep Trophy-2024)కి రంగం సిద్ధమైంది. సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీ తదితరులు తొలుత దులీప్ ట్రోఫీలో ఆడుతారని వార్తలు వచ్చాయి. అయితే రానున్న అంతర్జాతీయ సిరీస్‌లను ద‌ృష్టిలో పెట్టుకొని వారికి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ ట్రోఫీ ఏటా ఈస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ జట్ల మధ్య జరుగుతుంది. కానీ ఈ సారి ఇంటర్నేషనల్ స్టార్, దేశవాళీ ప్లేయర్లను కలిపి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. తాజాగా తొలి రౌండ్‌లో పాల్గొనే జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఇండియా-ఎ, బి, సి, డి, జట్లుగా విభజించింది. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లను కెప్టెన్లుగా ప్రకటించింది. కాగా అనంతపూర్ వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు ఈ టోర్నీ జరగనుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ చూడొచ్చు.

* టీమ్‌ల వివరాలు ఇవే..

* టీమ్-ఎ
శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

* టీమ్-బి
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి (ఫిట్‌నెస్ సాధిస్తే), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్.

* టీమ్-సి
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, సందీప్ వారియర్.

 టీమ్-డి
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, KS భరత్, సౌరభ్ కుమార్.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *