ManaEnadu:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారం రోజు విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ నోటీసులు పంపింది. కవిత పీఆర్వో రాజేష్తోపాటు మరో ఇద్దరు వ్యక్తిగత సహాయకులకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. వీరు సోమవారం రోజు విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపింది. కవిత విచారణ సమయంలో భర్త అనీల్ చేస్తున్న వ్యాపారాలకు సంబంధించిన కీలక పత్రాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.