Mana Enadu:పదో తరగతి తర్వాత త్వరగా స్థిరపడాలనుకుంటే ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చేయడం మంచి ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఒకేషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి శిక్షణ లేకుండా సంబంధిత విభాగంకు సంబంధించి సంస్థల్లో చేరవచ్చు. లేదంటే కోర్సు చేయడం ద్వారా పొందిన నైపుణ్యంతో స్వతహాగా ఉపాధి పొందవచ్చు. అలాగే ఉన్నత విద్యకు అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ ఒకేషనల్ కాలేజీల్లో రెండేళ్ల కాల వ్యవధిగల 27ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, నైపుణ్యాన్ని బట్టి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.
ఏ కోర్సులు ఉన్నాయంటే?
బిజినెస్ అండ్ కామర్స్‌కు సంబంధించి అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్‌కు సంబంధించి క్రాప్ ప్రొడక్షన్, లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్, సెరీకల్చర్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ & ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సర్వీసింగ్, రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ వంటి కోర్సులు ఉన్నాయి.
వీటితోపాటు వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజినీరింగ్, డీపీటీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్‌కు సంబంధించి కమర్షియల్ గార్మెంట్స్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, అదేవిధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్, పారా మెడికల్‌కు సంబంధించి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మా టెక్నాలజీ బ్రాంచీల్లో చేయవచ్చు.
ఓపెన్ స్కూల్ విధానం:
కాలేజీకి వెళ్లి ఒకేషనల్ కోర్సులు చదవడం వీలుకానివారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెనింగ్ స్కూలింగ్ అందించే ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంల్లో చేరవచ్చు. పదోతరగతి విద్యార్హతతో ఇక్కడ వివిధ ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్ సెకండరీ, డిప్లొమా, సర్టిఫికెట్ స్థాయుల్లో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు.
సర్టిఫికెట్& డిప్లొమా కోర్సులు
టైప్ రైటింగ్, స్టెనోగ్రఫీ, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లియన్స్ రిపైరింగ్, మోటార్ అండ్ ట్రాన్స్‌ఫార్మర్ రివైండింగ్, టీవీ రిపేరింగ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, హౌస్ కీపింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, క్యాటరింగ్ మేనేజ్‌మెంట్, లైబ్రరీ సైన్స్ తదితర కోర్సులు ఉన్నాయి.