ManaEnadu:ప్రస్తుతం మీరు ఏ జాబ్‌కు అప్లై చేసుకోవాలన్నా.. లోన్ తీసుకోవాలన్నా.. ప్రతి దానికి అవసరమయ్యే డాక్యుమెంట్లలో తప్పకుండా ఉండాల్సింది ఆధార్. ప్రస్తుతం ఈ 12 అంకెల గుర్తింపు పత్రం మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆధార్ నంబర్ కొడితే చాలు మీకు సంబంధించిన డేటా మొత్తం వచ్చేస్తుంది. అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డును చాలా మంది ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ పాడేస్కుంటారు. దీనివల్ల ఆధార్ దుర్వినియోగం అయ్యే సమస్య తలెత్తుతుంది. మరి మీ ఆధార్ ఎక్కడైనా మిస్ యూజ్ అయిందా? ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి.
ఆధార్ మిస్ యూజ్ అయిందో లేదో ఇలా తెలుసుకోవాలి..?
ఉడాయ్ పోర్టల్‌కు వెళ్లి My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar servicesపై క్లిక్ చేయండి
కిందకు స్క్రోల్ చేసి అందులో Aadhaar Authentication History అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్కోండి
ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయిన పేజీలో లాగిన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయండి
నెక్స్ట్ పేజ్‌లో కిందకు స్క్రోల్ చేసి Authentication History పై క్లిక్ చేయండి.
అక్కడ ALLని సెలెక్ట్ చేసి డేట్ ఎంచుకుని Fetch Authentication History పై క్లిక్ చేయండి.
ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ యూజ్ చేశారో మొత్తం డేటా వచ్చేస్తుంది.
ఆధార్ దుర్వినియోగంపై ఎలా ఫిర్యాదు చేయాలంటే.. ?
మీకు తెలియకుండా మీ ఆధార్‌ను ఎక్కడైనా వినియోగించారనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా help@uidai.gov.inకి మెయిల్ చేయొచ్చు. ఇదీ కాకపోతే..ఉడాయ్ వెబ్‌సైట్‌లో నేరుగా కంప్లెయింట్ చేయొచ్చు.