TG:కేసీఆర్, హరీశ్ ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే తప్పిదాలు’

ManaEnadu:కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గతంలో విచారించిన అధికారుల నుంచి సేకరించిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తూ తాజాగా బహిరంగంగా వారిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు విచారణలో భాగంగా ఇవాళ మాజీ ఈఎన్సీ మురళీధర్‌, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్‌ రెడ్డి కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి కమిషన్‌ ముందు కీలక అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్‌లకు ఫైనల్‌ అప్రూవల్‌కు తాను మొదట సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్​లను త్వరగా అప్రూవ్ చేయాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారని, వారి ఒత్తిడి వల్ల హడావుడిగా అన్నీ అప్రూవల్‌ చేశామని ఆయన కమిషన్ ఎదుట అంగీకరించారు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు ఎల్‌అండ్‌టీ సంస్థ పాల్గొందని వెల్లడించారు.

ప్రాజెక్టు నిర్మాణ సంబంధ చర్చల్లో తాను పాల్గొనలేదని నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే తప్పిదాలు జరిగాయని.. ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని వెల్లడించారు. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్‌ చెక్‌ సరిగా చేయలేదని పేర్కొన్నారు. బ్యారేజీ నిర్వహణ, గేట్ల ఆపరేషన్‌ సరిగా చేయలేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట చెప్పారు.

Share post:

లేటెస్ట్