Mana Enadu: ‘‘నిక్కర్ నుంచి జీన్స్ లోకి మారినా.. సైకిల్ నుంచి బైక్ లోకి మారినా.. నోటుబుక్ నుంచి ఫేసుబుక్ కి మారినా.. ఏరా పిలుపు నుంచి బాబాయ్ పిలుపు దాకా… కాలింగ్ మారినా.. ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా.. ఫీలింగ్ మారునా.. ట్రెండు మారినా ఫ్రెండు మారడే.. ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే.. గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే’’ఏంటి సాంగ్ చెబుతున్నాడని అనుకుంటున్నారా? అయినా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. ఈరోజు స్పెషలేంటో.. అదేనండీ ‘‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం..’’ ఈ స్పెషల్ డే గురించి.. అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…

మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతి
స్నేహాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. స్నేహం మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి. అందుకే స్నేహితుడిని మనసారా హత్తుకుని తనపై ఉన్న ప్రేమను తెలియజేస్తారు. ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా.. ఒక్క స్నేహితుడు మాత్రమే జీవితాంతం మనకు అన్ని వేళలా అండగా ఉంటాడు. ఒక మంచి స్నేహితుడు మనకు తోడుగా ఉన్నాడన్నా ఆలోచనే మనల్ని ఎన్ని కష్టాల్నుంచి బటయడేస్తుంది. అందుకే కవులంటారు స్నేహితుడు కొండంత అండ అని . అందుకే అంటారు కదా.. మంచి స్నేహితుడు ఒక్కడున్నా వంద మందితో సమానమని. ఎంతైనా గొప్ప స్నేహితుడిని పొందడానికి కూడా లక్ ఉండాలి.

పురాణాల్లోనూ స్నేహితులున్నారు..
రామాయణం, మహాభారతం కాలం నుంచి స్నేహితులుగా ఉండి ఎంతోమంది ప్రాణ త్యాగాలను చేసిన కథలను కూడా మనం చదివాం. పురణాల్లో కృష్ణుడు-కుచేలుడు, దుర్యోధనుడు-కర్ణుడు, రాముడు- సుగ్రీవుడు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి విలువలు ఉన్న స్నేహితుడు దొరికితే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కర్ణుడు నిజానికి చాలా గొప్పవాడు, శక్తివంతుడు. కానీ చెడు లక్షణాలు ఉన్న కౌరువుల వైపు ఉన్న కారణంగా చరిత్రలో చెడ్డపేరును తెచ్చుకున్నాడు.
ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..
1935లో యునైటెడ్ స్టేట్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్‌గా ప్రకటించింది. మనదేశంలో ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం రోజే దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచం మొత్తం ప్రెండ్షిప్ డే జరుపుకున్నప్పటికీ దేశాన్ని బట్టీ తేదీ మారుతుంది. ఐక్యరాజ్య సమితి జులై 30న ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. మనదేశంలో 1990లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. 2011లో ఐక్యరాజ్య సమితి దీన్ని అధికారికంగా గుర్తించింది. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇదే మంచి సందర్భం.. మధురమైన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి కూడా స్నేహితుల దినోత్సవం ఒక అందమైన రోజు. ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేప్పేయండి..








