ManaEnadu:వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా జ్వరపీడితులతో రద్దీగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో డెంగీ దోమలు విజృంభిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో డెంజీ విపరీతంగా విజృంభిస్తోంది. భారీగా కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే డెంగీ కట్టడికి చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తోంది.
రెండు నెలల్లో 4వేలకు పైగా కేసులు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5,372 మంది డెంగీ జ్వరం బారినపడ్డారు. జూన్‌లో 1,078 మంది ఈ జ్వరంతో బాధపడగా.. గత రెండు నెలల్లో ఏకంగా ఈ కేసులు 4,294 నమోదయ్యాయి. ఇక డెంగీ నిర్ధారణకు చేస్తున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివ్‌గా నిర్దారణ అవుతున్నాయి. అంటే ప్రతి 200 శాంపిల్స్‌లో 13 మంది డెంగీ బారిన పడుతున్నారన్నట్టు. ముఖ్యంగా హైదరాబాద్‌లో అత్యధికంగా.. ఆ తర్వాత సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
గన్యా కేసులూ పెరుగుతున్నాయి..
మరోవైపు రాష్ట్రంలో గన్యా కేసులూ పెరుగుతున్నాయని వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గన్యా ఉందన్న అనుమానంతో 2,673 నమూనాలను పరీక్షించగా 152మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బయటపడుతున్నాయని పేర్కొంది. ఈ కాలంలో పిల్లలకు జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం వస్తే అనుమానించాలి
పిల్లలకు జ్వరం వస్తే వెంటనే ఆస్పత్రికి తరలించి డెంగీ పరీక్షలు చేయించాలి.
జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదు.
రెండ్రోజుల వరకు కూడా జ్వరం తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
వానాకాలంలో బాగా కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ఇక వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి.
ఈ కాలంలో బయట ఫుడ్ తినకపోవడమే మంచిది.
101 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, చలితో కూడిన జ్వరం, వాంతులు, తీవ్ర నీరసం, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…